News August 11, 2024
ఆయుధ పూజ చేస్తున్న ‘దేవర’

ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా శరవేగంగా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రస్తుతం ఆయుధ పూజ పాట చిత్రీకరణ నడుస్తోందని మూవీ టీం ట్విటర్లో పంచుకుంది. పోస్టర్లలో ఎన్టీఆర్ చేతిలో కనిపిస్తున్న గొడ్డలి వంటి ఆయుధం తాలూకు ఫొటోను పోస్ట్ చేసింది. అటు.. తాను ఆయుధ పూజ సాంగ్ షూట్ చూస్తూ ఎమోషనల్ అయ్యానని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. కాగా, చుట్టమల్లే సాంగ్ ఇప్పటికే ట్రెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News December 3, 2025
కోర్టుకెక్కిన పేరూరు గ్రామ ‘పంచాయితీ’..!

నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం పేరూరులో ఎస్టీ మహిళ ఓటర్లు లేకున్నా గ్రామ సర్పంచ్, వార్డులు ఎస్టీ మహిళకి రిజర్వ్డ్ కావడంతో పంచాయతీ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా గ్రామంలో కేవలం ఒక్కరే ఎస్సీ అభ్యర్థి (పురుషుడు) ఉన్నారు. గ్రామ పంచాయతీలు 8 వార్డులు ఉండగా వాటిలో నాలుగు వార్డులు ఎస్టీకి రిజర్వ్డ్ చేశారు. ప్రస్తుతం ఈ పంచాయితీ కోర్టుకెక్కింది.
News December 3, 2025
హనుమాన్ చాలీసా భావం – 28

ఔర మనోరథ జో కోయీ లావై |
సోయి అమిత జీవన ఫల పావై ||
మనుషులు అనేక కోరికలతో దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ, హనుమంతుడిని సేవించేవారు మాత్రం జీవితంలో అపారమైన జీవన ఫలాలను పొందుతారు. ఆయన అనుగ్రహంతో అన్ని రకాల సుఖ సంతోషాలు, విజయాలు, అంతిమంగా మోక్షం కూడా లభిస్తాయి. హనుమంతుడిని వరం కోరడం అంటే, ఇక వేరే కోరిక అవసరం లేదు అని సందేశం. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 3, 2025
IPL-2026: వీరిలో ఎవరిని మిస్ అవుతారు?

ఫారిన్ ప్లేయర్లు రసెల్, డుప్లెసిస్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించగా మరో ప్లేయర్ మ్యాక్స్వెల్ వచ్చే సీజన్కు అందుబాటులో ఉండట్లేదని అనౌన్స్ చేశారు. తమదైన ఆటతో మ్యాచు స్వరూపాన్నే మార్చేయడంలో వీరు దిట్ట. స్థిరత్వానికి డుప్లెసిస్ మారుపేరు కాగా, ఆల్రౌండర్ కోటాలో మ్యాక్సీ, రసెల్ రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీరి స్థానాలను ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం కష్టమే. మీరు వీరిలో ఎవరి ఆట మిస్ అవుతారు? కామెంట్.


