News September 14, 2025
దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు: లోకేశ్

AP: తన కుమారుడు దేవాన్ష్ ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నాడని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించాడని పేర్కొన్నారు. లండన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తాను పాల్గొన్నానని చెప్పారు. దేవాన్ష్ ముందు చూపు, ఆలోచనా శక్తి, ఒత్తిడిలో ప్రదర్శించిన సమయస్ఫూర్తి వల్లే ఈ విజయం సాధ్యమైందని లోకేశ్ వివరించారు.
Similar News
News January 19, 2026
మహిళలు శంఖానాదం చేయకూడదా?

మన ధర్మశాస్త్రాల ప్రకారం మహిళలు శంఖం ఊదకూడదనే నియమం ఎక్కడా లేదు. శంఖానాదం ఆధ్యాత్మికంగా సానుకూలతను ఇస్తుంది. అయితే శంఖం ఊదేటప్పుడు నాభి భాగంపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది మహిళల గర్భాశయ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే పూర్వీకులు ఈ జాగ్రత్తను సూచించారు. గర్భిణీలు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం. ఇది ఆరోగ్యపరమైన సూచనే తప్ప ఆంక్ష కాదు. శారీరక సామర్థ్యం ఉన్న మహిళలు నిరభ్యంతరంగా శంఖానాదం చేయవచ్చు.
News January 19, 2026
నేడు దావోస్‌కు CM రేవంత్

TG: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు నేడు సీఎం రేవంత్ దావోస్ వెళ్లనున్నారు. మేడారంలో మహాజాతరను ప్రారంభించాక ఉ.8 గం.కు హెలికాప్టర్‌లో HYD చేరుకుంటారు. ఉ.9.30గం.కు శంషాబాద్ నుంచి CM, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు పర్యటనకు వెళ్లనున్నారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి సంస్థల అధినేతలతో రేవంత్ భేటీ అవుతారు.
News January 19, 2026
శివపార్వతుల నిత్య నివాసం, మోక్ష క్షేత్రం ‘వారణాసి’

పురాణాల ప్రకారం.. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు కైలాసం వదిలి గంగాతీరంలోని కాశీని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. అందుకే కాశీ శివపార్వతుల గృహంగా, మోక్ష నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి విశ్వనాథ జ్యోతిర్లింగ దర్శనం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. జీవన్మరణాల సంగమమైన ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.


