News September 30, 2024

చాలా ప్రాంతాల్లో ‘దేవర’ బ్రేక్ ఈవెన్ పూర్తి!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలా చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌తో నడుస్తున్నాయి. దీంతో బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈ మార్క్‌ను చేరుకున్నట్లు తెలిపాయి. మాస్ ఏరియాల్లో ముఖ్యంగా సి సెంటర్లలో దేవర రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తోందని వెల్లడించాయి.

Similar News

News September 30, 2024

నివాస ఇళ్లను హైడ్రా కూల్చదు: రంగనాథ్

image

TG: పేదలు, మధ్య తరగతి ప్రజల జోలికి హైడ్రా వెళ్లదని, ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చదని కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకేనని చెప్పారు. ప్ర‌కృతి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌, చెరువులు, కుంట‌లు, నాలాలను కాపాడ‌డం, వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ర‌హ‌దారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు చేపట్టడమే హైడ్రా పని అన్నారు.

News September 30, 2024

హిట్‌మ్యాన్ అరుదైన ఘనత

image

కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సుతో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దీంతో తొలి బంతికే సిక్స్ కొట్టిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచారు. 2006లో WIపై ధోనీ, 2012లో NZపై జహీర్ ఖాన్, 2013లో AUSపై సచిన్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టారు. కాగా, హసన్ మిరాజ్ బౌలింగ్‌లో 23 పరుగుల వద్ద రోహిత్ బౌల్డ్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగులకు డిక్లేర్ చేసింది.

News September 30, 2024

PM E-DRIVEకు క్యాబినెట్ ఆమోదం

image

దేశంలో EVల వినియోగాన్ని మ‌రింత ప్రోత్స‌హించ‌డానికి ఉద్దేశించిన PM E-DRIVEకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద రెండేళ్ల పాటు రూ.10,900 కోట్ల ప్రోత్సాహ‌కాలు ఇవ్వనున్నారు. E-2Ws, E-3Ws, E-అంబులెన్స్‌లు, E-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్లు, ఛార్జింగ్ వసతులు, E-బస్సుల కోసం మిగిలిన మొత్తాన్ని ఉపయోగిస్తారు. రేప‌టి నుంచి(మంగ‌ళ‌వారం) ఈ స్కీం అమ‌లులోకి రానుంది.