News August 20, 2024
‘దేవర’ క్రేజ్ మామూలుగా లేదుగా!

అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ‘ORMAX’ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ తర్వాత విడుదలయ్యే, ట్రైలర్ రిలీజ్ కాని సినిమాలపై సంస్థ సర్వే చేసింది. ఇందులో ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ సినిమా కోసం ఎక్కువ మంది ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో ‘పుష్ప-2’, OG, స్పిరిట్, జై హనుమాన్ సినిమాలున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
Similar News
News December 5, 2025
OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


