News October 15, 2024
దేవర మూవీ మరో రికార్డ్

కలెక్షన్లలో ‘దేవర’ మూవీ మరో ఘనత సాధించింది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 18రోజుల పాటు కనీసం రూ.కోటి చొప్పున వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తర్వాత ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే అని పేర్కొన్నాయి. ఇటు సీడెడ్లో కలెక్షన్లు రూ.30 కోట్లు దాటాయి. దీంతో ఆ ఏరియాలో రూ.30 కోట్లు దాటిన 2 సినిమాలు ఉన్న వ్యక్తిగా NTR నిలిచారు. ఇప్పటి వరకు ఈ మూవీ రూ.510 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Similar News
News November 20, 2025
HYD: మార్చి 2026 నాటికి మెట్రో లైన్ క్లియర్

HYDలో సుమారు 162 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఏ కారిడార్లు సాధ్యమో, విస్తరణ స్థాయి ఎంత వరకూ ఉండాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాలతో దశంలో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయనుందని మంత్రి HYDలో పేర్కొన్నారు.
News November 20, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 10

56. స్నానం అంటే ఏమిటి? (జ.మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? (జ.సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? (జ.ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (జ.ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)
60. ఏది కాయం? (జ.సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 20, 2025
APPLY NOW: NRDCలో ఉద్యోగాలు..

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(<


