News September 21, 2024

ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపు

image

Jr.NTR ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే రిలీజ్ రోజున(SEP 27) 12AM నుంచి మొత్తం 6షోలు, 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Similar News

News December 4, 2025

అంతరిక్షం నుంచి పవిత్ర మక్కా ఎలా ఉందో చూడండి!

image

ముస్లింల పవిత్ర నగరం ‘మక్కా’ అద్భుత చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూమికి 400KM దూరంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి రాత్రిపూట వ్యోమగామి డాన్ పెటిట్ ఫొటో తీశారు. ‘సౌదీ అరేబియాలోని మక్కా ఆర్బిటల్ వ్యూ ఇది. మధ్యలో వెలిగిపోతున్నది ఇస్లాం పవిత్ర స్థలం కాబా. స్పేస్ నుంచి కూడా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. డాన్ పెటిట్ తన నాలుగో మిషన్‌లో ISS కుపోలా విండో నుంచి ఈ దృశ్యాన్ని తీశారు.

News December 4, 2025

ఇంటి చిట్కాలు

image

* మినరల్ వాటర్ క్యాన్‌ను శుభ్రం చేసేందుకు బేకింగ్ సోడా, రాళ్ల ఉప్పు, నిమ్మరసం వేసి పావుగంట తర్వాత క్యాన్‌ను క్లీన్ చేస్తే సరిపోతుంది.
* బట్టల మీద ఇంక్ మరకలు పోవాలంటే మరకపై కాస్త నీరు చల్లి, పేస్ట్ తీసుకొని బ్రష్‌తో రుద్ది నీటితో వాష్ చేస్తే మరకలు పోతాయి.
* అగరొత్తుల నుసితో ఇత్తడి సామన్లు శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* లెదర్ వస్తువులను నిమ్మచెక్కతో శుభ్రం చేస్తే మెరుస్తాయి.

News December 4, 2025

ఒక్క వ్యక్తి ఆధారంగా రిజర్వేషన్.. ఎన్నిక బహిష్కరణ

image

TG: STలే లేని పంచాయతీకి ST రిజర్వేషన్ ప్రకటించడంతో నల్గొండ(D) అనుముల(M) పేరూరు గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. గతంలో పేరూరు, వీర్లగడ్డ తండా కలిపి ఉమ్మడి పంచాయతీగా ఉండేవి. తరువాత రెండూ విడిపోయాయి. ఆ సమయంలో తప్పుగా నమోదైన ఒకే ఒక్క ఎస్టీ వ్యక్తిని ఆధారంగా తీసుకుని పేరూరు రిజర్వేషన్ కేటాయించారు. ST అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు. దీనిపై గ్రామస్థులు HCని ఆశ్రయించారు.