News September 19, 2024

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఎక్కడ నిర్వహిస్తున్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తొలుత ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడో ఓ చోట ఔట్‌డోర్‌లో ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో HYDలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 20, 2025

భారీగా పెరిగిన టమాటా ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా పంట దెబ్బతినడంతో టమాటా ధరలు భారీగా పెరిగాయి. అన్నమయ్య (D) మదనపల్లె మార్కెట్లో నిన్న ఒకటో రకం టమాటా కిలో రూ.50 పలికింది. ఈ ఏడాది ఇది రెండో అత్యధిక ధర. నవంబరులో గరిష్ఠంగా కేజీ రూ.66కు విక్రయించారు. అటు తెలంగాణలోనూ టమాటా డిమాండ్ పెరిగింది. బహిరంగ మార్కెట్లలో ఏరియాను బట్టి కిలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. మీ ఊరిలో కిలో టమాటా ధర ఎంత ఉంది?

News December 20, 2025

మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలి?

image

మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి, ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10గ్రా., లీటరు నీటికి బోరాన్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పూమొగ్గ దశలో తేనెమంచు పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపైనే కాకుండా మొదళ్లపైన, కొమ్మలపైన కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News December 20, 2025

నేటి నుంచి పుష్య మాసం.. ఇలా చేయండి!

image

పుష్య మాసం పుణ్య మాసం. పుష్యమి నక్షత్రం వల్ల ఈ పేరొచ్చింది. ఈ మాసం శనిదేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా అనంత పుణ్యఫలాన్ని ఇస్తుందని అంటారు. నదీ స్నానాలు, సూర్యారాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు.