News September 6, 2024

DEVARA: రిలీజ్‌కు ముందే రికార్డు

image

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో అత్యంత వేగంగా 15,000 టికెట్లు అమ్ముడైన తొలి ఇండియన్ మూవీగా అవతరించింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇండియన్ సినిమా ఇన్‌ఫ్లుయెన్స్‌కు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. USAలో మాత్రం 26న విడుదలవుతుంది.

Similar News

News November 15, 2025

ICMRలో 28 పోస్టులు

image

<>ICMR<<>>లో 28 సైంటిస్ట్-B పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.icmr.gov.in/

News November 15, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
* దివంగత కవి అందెశ్రీ కొడుకు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం యోచన
* నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత.. వైరల్ ఫీవర్‌తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లలకు ఇంజెక్షన్ చేయడంతో రియాక్షన్
* నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ

News November 15, 2025

మరో కీలక మావో లొంగుబాటు?

image

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్‌తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.