News July 27, 2024
‘దేవర’ సెకండ్ సింగిల్ అప్డేట్ ఆ రోజునే?

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఆగస్టు 2 లేదా 3న సెకండ్ సింగిల్‌పై మూవీ యూనిట్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ పోషిస్తున్నారు. సెప్టెంబర్ 27న మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.
Similar News
News December 17, 2025
GNT: ఎల్‌హెచ్‌బీ బోగీలతో ఆ రైళ్లు.. డిసెంబర్ 22 నుంచి అమలు

పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. డిసెంబర్ 22, 2025 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. కాచిగూడ-రేపల్లె-వికారాబాద్ (17625/26), సికింద్రాబాద్-రేపల్లె (17645/46), సికింద్రాబాద్-మణుగూరు (12745/46) పాత బోగీల స్థానంలో ఎల్‌హెచ్‌బీ రావడంతో ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది.
News December 17, 2025
విశాఖలో పొగమంచు.. ఉమెన్స్ టీమ్ ఫ్లైట్ డైవర్ట్

దేశంలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. ఉమెన్స్ టీ20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయల్దేరిన ఫ్లైట్‌ను పూర్ విజిబిలిటీ కారణంగా విజయవాడకు డైవర్ట్ చేశారు. ఈ నెల 21, 23 తేదీల్లో శ్రీలంకతో మ్యాచ్‌ల కోసం మహిళా జట్టు విశాఖకు వెళ్లాల్సి ఉంది. అటు విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన మరో విమానం కూడా పొగమంచు కారణంగా క్యాన్సిల్ అయింది.
News December 17, 2025
చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి: సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులకు CM దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా ఉంటారని తెలిపారు. మనం ఏం చేశామనే వివరాలు సమగ్రంగా ఉండాలని, నిరంతరం నేర్చుకునే పనిలో ఉండాలని అన్నారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని, జవాబుదారీతనం ఉండాలని పిలుపునిచ్చారు.


