News April 16, 2024
తక్కువ ధరకే ‘దేవర’ థియేట్రికల్ రైట్స్?
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘దేవర’ మూవీ థియేట్రికల్ హక్కులను తక్కువ ధరకు కోట్ చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.130 కోట్లకు కోట్ చేసినట్లు సమాచారం. ఇది తారక్ కెరీర్‌లో హయ్యెస్ట్ రైట్స్. కానీ ట్రెండ్ ప్రకారం ఇది చాలా తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప2, కల్కి చిత్రాల థియేట్రికల్ రైట్స్ ఒక్కో రాష్ట్రంలోనే దాదాపు రూ.100 కోట్లు పలకనున్నట్లు టాక్.
Similar News
News November 17, 2024
రేపు ఢిల్లీకి కేటీఆర్!
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. వికారాబాద్(D) లగచర్ల గిరిజనులతో కలిసి జాతీయ ST కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లగచర్లలో ఫార్మా భూసేకరణపై చర్చించే క్రమంలో కలెక్టర్‌పై పలువురు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
News November 17, 2024
గ్రూప్-3 పరీక్షకు హాజరైంది 50శాతం మందే
తెలంగాణ వ్యాప్తంగా 1401 ఎగ్జామ్ సెంటర్లలో ఇవాళ జరిగిన గ్రూప్-3 పరీక్ష రాసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు. 5.36 లక్షల మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 76.4శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఉదయం పేపర్-1కు 2,73,847 మంది, పేపర్-2కు 2,72,173 మంది మాత్రమే హాజరైనట్లు TGPSC ప్రకటించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 64శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
News November 17, 2024
వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం
TG: వరంగల్ మాస్టర్‌ప్లాన్-2041కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్‌ను ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది. ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై 2018లో కుడా స్వీకరించిన అభ్యంతరాలు, భూ వినియోగ జోన్లు, ఇతర నియంత్రణలపై రేపు గెజిట్ విడుదల చేయనుంది. 2041 నాటికి వరంగల్ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు సమాచారం.