News September 2, 2024
‘దేవర’ థర్డ్ సింగిల్.. క్రేజీ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ నుంచి అప్డేట్ వచ్చింది. సినిమాలోని థర్డ్ సింగిల్ ‘దావుడి’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 4న వీడియో సాంగ్ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగా ఈనెల 27న ‘దేవర’ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ఫియర్, చుట్టమల్లే సాంగ్స్ యూట్యూబ్ను షేక్ చేస్తున్నాయి.
Similar News
News December 8, 2025
శబరిమల: 18 మెట్లు దేనిని సూచిస్తాయంటే?

పదునెట్టాంబడిలో మొదటి 5 మెట్లు మనిషిలోని పంచేంద్రియాలను సూచిస్తాయి. వీటిని అదుపులో ఉంచుకుని మందుకు సాగాలనే సారాంశాన్ని అందిస్తాయి. తర్వాత వచ్చే 8 మెట్లు కామం, కోపం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం అనే 8 రాగద్వేషాలను సూచిస్తాయి. వాటిని వదిలి మంచి మార్గంలో నడవాలని చెబుతాయి. ఆ తర్వాత 3 మెట్లు సత్వ, రజో, తమో అనే త్రిగుణాలకు ప్రతీక. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీక. <<-se>>#AyyappaMala<<>>
News December 8, 2025
షూటింగ్ ప్రపంచకప్లో స్వర్ణం సాధించిన సురుచి

ఖతార్లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్లో భారత షూటర్ సురుచీ సింగ్ స్వర్ణం సాధించారు. విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సురుచి 245.1 పాయింట్లతో పోడియం ఫినిష్ చేసి జూనియర్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. హర్యానాకు చెందిన సురుచి ఈ ఏడాది బ్యూనస్ ఐరీస్, లిమా వేదికలపై కూడా వరుసగా గోల్డ్ మెడల్స్ గెలిచారు.
News December 8, 2025
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి

TG: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(M) గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సురేందర్ అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇటీవల ఉమ్మడి MBNR జిల్లాలో గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.


