News August 28, 2024

‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే నెల 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

Similar News

News December 4, 2025

వస్తువు కొనేముందు ఓ సారి ఆలోచించండి: హర్ష

image

అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్‌స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు. విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు. అందుకే వస్తువులను కొనేముందు అవి నిజంగా అవసరమా అని ఆలోచించండి. SHARE IT

News December 4, 2025

ఆఫర్లను రద్దు చేసిన 20 సంస్థలపై IITల బ్యాన్

image

జాబ్ ఆఫర్ ఇచ్చి ఆపై రద్దు చేసిన 20కి పైగా సంస్థలను ప్లేస్‌మెంట్ల డ్రైవ్ నుంచి IITలు నిషేధించాయి. ఆ కంపెనీల చర్య విద్యార్థుల కెరీర్ ప్లానింగ్‌కు ఆటంకం కలిగించడంతో పాటు ఒత్తిడికి గురిచేయడమే దీనికి కారణం. ఇందులో డేటా అనలటిక్స్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఆఫర్ లెటర్లో ఇచ్చిన ప్యాకేజీని జాయినింగ్‌కు ముందు తగ్గించాయి. కంపెనీల ప్లేస్‌మెంట్ల హిస్టరీని పరిశీలిస్తున్నట్లు IIT ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.

News December 4, 2025

హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు.. హత్య అంటూ లేఖ

image

<<18318593>>హిడ్మా<<>> ఎన్‌కౌంటర్‌పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట లేఖ విడుదల చేశారు. హిడ్మా, శంకర్‌ను ఎన్‌కౌంటర్ చేయలేదని, ఇది పూర్తిగా భూటకపు హత్యలని విమర్శించారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్తుండగా అరెస్ట్ చేశారన్నారు. వారం రోజుల పాటు వారిని చిత్రహింసలు పెట్టి చంపారని ఆరోపించారు. హత్యలపై న్యాయవిచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.