News December 11, 2024
ఇంకా జోరు తగ్గని ‘దేవర’

ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ విడుదలై మూడు నెలలు దాటినా జోరు కొనసాగిస్తోంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ వేదికపై అత్యధికంగా వీక్షించిన రెండో దక్షిణాది చిత్రంగా నిలిచింది. వరుసగా 5వారాల పాటు టాప్ 10లో ట్రెండ్ అవుతోందని దేవర మూవీ టీమ్ తెలిపింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్వైడ్ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
Similar News
News January 25, 2026
ఆలు కుదురూ చేను కుదురూ ఆనందం

“ఆలు”అంటే భార్య. “కుదురు” అంటే స్థిరత్వం లేదా సవ్యంగా ఉండటం. భార్యతో కలహాలు లేకుండా కుటుంబ జీవితం సజావుగా, సంతోషంగా, స్థిరంగా ఉన్నప్పుడూ.. చేను కుదురూ అంటే పొలం(ఆదాయ వనరులు) బాగుండి, ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడే రైతు జీవితంలో నిజమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయని ఈ సామెత చెబుతుంది.
News January 25, 2026
నేడు ఆదిత్య హృదయం ఎందుకు పఠించాలి?

సూర్యారాధన వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయని నమ్మకం. రామాయణ యుద్ధంలో అలసిన రాముడికి అగస్త్యుడు ‘ఆదిత్య హృదయం’ బోధించారని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని పఠిస్తే లభించిన శక్తితోనే రాముడు రావణుడిని సంహరించగలిగాడని నమ్ముతారు. అలాగే మయూరుడు అనే కవి సూర్యుని స్తుతించి కుష్టు వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. పాండవులు అరణ్యవాసంలో సూర్యుని అనుగ్రహంతోనే ‘అక్షయపాత్ర’ను పొంది అతిథి సత్కారాలు చేయగలిగారు.
News January 25, 2026
పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎప్పుడంటే?

AP: పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ నిర్వాసితులకు జూన్లోగా పరిహారం ఇవ్వాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. మొత్తం 21,709 కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు రూ.2,497.98 కోట్లు అవసరం అని అంచనా వేసింది. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు తొలిదశ పనులను, ఈ ఏడాది డిసెంబర్లోగా పునరావాస కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 28 కాలనీలు పూర్తవగా మరో 49 కాలనీల పనులు పూర్తి కావాల్సి ఉంది.


