News December 17, 2024
రిజర్వేషన్లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు

కులం ఆధారంగానే రిజర్వేషన్లను కొనసాగించాలా? లేక ఆర్థిక స్థితిపై కల్పించాలన్న విషయంలో పార్లమెంటు పునరాలోచించాలని Ex PM దేవెగౌడ వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చినవి ప్రజల స్థితిని మార్చలేకపోయాయని, ఇప్పటికీ రెండు పూటలా భోజనానికి తిప్పలు పడుతున్నవారు అనేక మంది ఉన్నారన్నారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలా? ఆర్థిక స్థితిపై ఇవ్వాలా? అనేదానిపై మనసు పెట్టి ఆలోచించాలన్నారు.
Similar News
News October 20, 2025
నరకాసురుడి జననం

దితి, కశ్యప ప్రజాపతి పుత్రుడైన హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచాడు. దీంతో భూమిని రక్షించేందుకు శ్రీమహా విష్ణువు వరాహ అవతారాన్ని ధరించాడు. ఆయన తన వజ్ర సమానమైన కోరతో హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని పైకి తీసుకు వచ్చాడు. ఆ సమయంలో భూదేవికి, వరాహ స్వామికి ఒక పుత్రుడు జన్మించాడు. అతడే నరకాసురుడు. అతడు నిషిద్ధమైన సంధ్యా సమయంలో జన్మించడం వల్ల అసుర లక్షణాలు అబ్బుతాయి.
News October 20, 2025
దేవతలకు అసురుడెందుకు జన్మించాడు?

లోకాలను పాలించే విష్ణుమూర్తి అవతారమైన వరాహ స్వామి పుత్రుడే ‘నరకాసురుడు’. అతని తల్లి భూదేవి. వీరిద్దరూ దేవతలే అయినా, వీరి కడుపున పుట్టినవాడు అసురుడిగా మారతాడు. అందుకు కారణం నరకాసురుడు పుట్టిన సమయమే. వరాహ స్వామి, భూదేవితో నిషిద్ధ కాలమైన సంధ్యా సమయంలో(పగలు, రాత్రి కలిసే వేళ) కలవడం వల్ల నరకాసురుడిలో అసుర లక్షణాలు వస్తాయి. అందుకే సంధ్యా సమయాన కొన్ని పనులు చేయొద్దొని మన పెద్దలు చెబుతుంటారు.
News October 20, 2025
విష్ణుమూర్తిని వరమడిగిన భూదేవి

సంధ్యా సమయాన కలవడం వల్ల జన్మించిన నరకాసురుడికి అసుర లక్షణాలు వస్తాయని విష్ణుమూర్తి, భూదేవికి చెప్పాడు. భవిష్యత్తులో విష్ణుమూర్తి చేతిలోనే తన బిడ్డకు సంహారం తప్పదని భయపడిన భూదేవి, తన పుత్రుడికి రక్షణ వరం ప్రసాదించమని వేడుకుంది. దానికి విష్ణువు సమ్మతించి, తల్లి చేతిలోనే మరణం ఉంటుందని వరమిచ్చాడు. ఏ తల్లి తన బిడ్డను చంపదని భావించి భూదేవి సంతోషించింది. అనంతరం నరకుడిని జనక మహారాజుకు అప్పగించింది.