News May 23, 2024
ప్రజ్వల్ రేవణ్ణకు దేవెగౌడ హెచ్చరిక

మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల రేవణ్ణ వెంటనే భారత్ రావాలని మాజీ ప్రధాని, తాత దేవెగౌడ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు Xలో ప్రకటన విడుదల చేశారు. పోలీసుల విచారణకు ప్రజ్వల్ సహకరించాలని కోరారు. ఈ కేసు విచారణలో తాను జోక్యం చేసుకోవడం లేదని దేవెగౌడ పేర్కొన్నారు. 60 ఏళ్లుగా ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవాలు బయటకు రావాల్సి ఉందన్నారు.
Similar News
News January 30, 2026
BC రిజర్వేషన్ జీవోలపై స్టే కొనసాగుతుంది: హైకోర్టు

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ఇచ్చిన జీవో(9, 41, 42)ల అమలుపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన వాటితోపాటు తమ వాదనలు కూడా వినాలని పలువురు కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్‌ల బెంచ్ విచారించింది.
News January 30, 2026
విటమిన్ D టాబ్లెట్లు ఎప్పుడు వాడాలంటే?

ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకల సమస్యలు, ఇతర కాల్షియం ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్‌ని తగ్గించే కాల్షియం, విటమిన్ డి ట్యాబ్లెట్స్ భోజనం తర్వాత తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి రెండు కలిపి ఉంటే భోజనం తర్వాత తీసుకోండి. విడివిడిగా ఉంటే కాస్తా గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది. పైగా ఈ ట్యాబ్లెట్స్‌ని ఐరన్ ట్యాబ్లెట్స్‌తో అస్సలు కలపకూడదని చెబుతున్నారు.
News January 30, 2026
మోకాళ్ల నొప్పి రాగానే నడక ఆపేస్తున్నారా?

చాలామంది మోకాళ్ల నొప్పి రాగానే నడవడం ఆపేస్తారు. అయితే మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం పరిష్కారం కాదని, అది కీళ్లు బిగుసుకుపోయేలా చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నడవడం వల్ల కీళ్ల మధ్య జిగురు పెరిగి కండరాలు దృఢంగా మారి ఒత్తిడిని తట్టుకుంటాయని చెబుతున్నారు. ఈత, సైక్లింగ్ వంటివి ప్రయత్నించాలని.. మరుసటి రోజు నొప్పి పెరగకపోతే అది మీకు సురక్షితమని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.


