News November 23, 2024
అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయి: మోదీ

మహారాష్ట్ర ఓటర్లు ఎన్డీయేకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత తమవైపు నిలబడ్డారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయని అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రతిఒక్క ఎన్డీయే కార్యకర్త కష్టపడ్డారని, వారందరికీ థాంక్స్ చెబుతున్నానన్నారు. మరోవైపు ఝార్ఖండ్‌లో విజయం సాధించిన JMM కూటమికి మోదీ కంగ్రాట్స్ చెప్పారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


