News December 14, 2024

అమరావతిలో మరో రూ.20వేల కోట్లతో అభివృద్ధి: నారాయణ

image

AP: అమరావతిలో మరో ₹20వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే E11, E13, E14 రోడ్లను మంత్రి పరిశీలించారు. అమరావతిలో ఇప్పటికే ₹21వేల కోట్ల పనులకు అనుమతి ఇచ్చామని, సోమవారం జరిగే CRDA అథారిటీ సమావేశంలో రూ.20వేల కోట్ల పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

Similar News

News November 25, 2025

రాములోరి జెండా ప్రత్యేకతలివే..

image

జెండాపై రాముడి సూర్యవంశం సూచించేలా భానుడు, విశ్వంలో సంపూర్ణ పవిత్ర శబ్దం ఓం, కోవిదారు వృక్ష చిహ్నాలున్నాయి. మందార, పారిజాత వృక్షాల అంటుకట్టుతో కశ్యప రుషి ఈ చెట్టును సృష్టించారని పురాణాలు తెలిపాయి. భరతుడి రథ ధ్వజంలోని జెండాలో గల ఈ చిహ్నం గురించి రఘువంశంలో కాళిదాసు ప్రస్తావించారు. ఈ జెండాను లక్ష్మణుడు దూరం నుంచే చూసి ‘సీతారాములను అయోధ్యకు తీసుకెళ్లేందుకు భరతుడు వస్తున్నాడ’ని అన్నకు సమాచారమిచ్చారు.

News November 25, 2025

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

AP: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలోని వన్ స్టాప్ సెంటర్‌లో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/

News November 25, 2025

ఈ నెల 28న ఓటీటీలోకి ‘మాస్ జాతర’

image

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ మూవీ OTTలోకి రానుంది. ఈ నెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.