News August 6, 2024
ఏపీలో లైట్‌హౌస్‌ల అభివృద్ధి

దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో 203 లైట్హౌస్లు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో 10 రాష్ట్రాల్లోని 75 లైట్‌హౌస్‌లను గుర్తించి వాటిని పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. ఏపీలోని రామాయపట్నం, మచిలీపట్నం, అంతర్వేది, శాక్రామెంటో, వాకలపూడి, సంతపల్లి, కళింగపట్నం, బారువ, వాడరేవు, పూడిమడక తీరప్రాంతాల్లో లైట్‌హౌస్‌లను అభివృద్ధి చేసినట్టు తెలిపింది.
Similar News
News December 20, 2025
అన్ని మతాలు మాకు సమానమే: సీఎం రేవంత్

TG: ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారని CM రేవంత్ చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టం తెస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని పేర్కొన్నారు.
News December 20, 2025
SM డిటాక్స్.. మెంటల్ హెల్త్‌కు బూస్ట్

ఒక వారం SMకు దూరంగా ఉంటే మెంటల్ హెల్త్ మెరుగవుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్టడీలో తేలింది. యాంగ్జైటీ 16.1%, డిప్రెషన్ 24.8%, ఇన్సోమ్నియా లక్షణాలు 14.5% తగ్గినట్టు గుర్తించింది. యువకులు రోజుకు 2గంటలు SM వాడుతున్నట్టు ఫోన్ డేటాతో తెలుసుకుంది. ‘డిటాక్స్ టైమ్‌లో SM వాడకం వారానికి 1.9hr నుంచి 30 నిమిషాలకు తగ్గింది. మిగిలిన టైమ్‌లో పలువురు బయటకు వెళ్లగా, కొందరు వర్కౌట్స్ చేశారు’ అని తెలిపింది.
News December 20, 2025
ALERT: ఈ వేరుశనగలు తింటే లివర్ క్యాన్సర్!

బూజు పట్టిన వేరుశనగలు తినడం ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిలో ఉండే అఫ్లాటాక్సిన్ B1 అనే విషపూరిత రసాయనం కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. ఇది శరీరంలోకి చేరితే తీవ్రమైన లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయడమే కాకుండా, DNAను మార్పు చేసి భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఆహార నిల్వ విషయంలో అప్రమత్తంగా ఉంటూ రంగు మారిన, బూజు పట్టిన గింజలను పారేయాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT


