News July 7, 2024

రూ.600 కోట్లతో వైజాగ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి

image

AP: రూ.600 కోట్లతో వైజాగ్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. త్వరలోనే టెండర్లను పిలుస్తామని తాజాగా పేర్కొన్నారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వే జోన్‌ కోసం ప్రయత్నిస్తున్నామని.. దీనిపై రైల్వే మంత్రిని కలుస్తామని ఆయన చెప్పారు. వైజాగ్‌ నుంచి మరిన్ని వందేభారత్ రైళ్లను నడిపేలా కృ‌షి చేస్తామన్నారు. రైల్వే జోన్ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉన్నట్లు ఎంపీ వెల్లడించారు.

Similar News

News March 29, 2026

రూ.12,000 కోట్ల ఆస్తి.. చివరికి

image

‘రేమండ్’తో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన <<19504124>>విజయ్‌పత్ సింఘానియా<<>> జీవిత చరమాంకంలో అద్దె ఇంట్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2015లో ₹12K కోట్ల కంపెనీతోపాటు తన 37% వాటా(₹1,000 కోట్లు)ను కొడుకు గౌతమ్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయన తండ్రిని పట్టించుకోవడం మానేశారు. ఆఖరికి ఇల్లు కూడా ఇవ్వకపోవడంతో విజయ్ కోర్టుకెక్కారు. కొడుకును నమ్మి ఆస్తులు అప్పగించడం అతిపెద్ద తప్పు అని సింఘానియా గతంలో చెప్పారు.

News March 29, 2026

ఎన్టీఆర్, చిరు, PK బాటలోనే విజయ్!

image

TN అసెంబ్లీ ఎన్నికల్లో TVK అధినేత విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాటలోనే ఆయన నడుస్తున్నారని SMలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ TDPని స్థాపించి 1983లో గుడివాడ, తిరుపతి నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. చిరంజీవి(ప్రజారాజ్యం) 2009లో తిరుపతి(విజయం), పాలకొల్లులో(ఓటమి) పోటీ చేశారు. పవన్(జనసేన) 2019లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడారు.

News March 29, 2026

KKRvsMI.. వాంఖడే పిచ్ రిపోర్ట్ ఇదే

image

ఇవాళ రాత్రి ముంబైలోని వాంఖడే <<19504194>>వేదికగా<<>> KKR, MI మ్యాచ్ జరగనుంది. ఈ గ్రౌండ్ పిచ్‌ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా అన్నివైపులా పరుగులు చేసే వీలుంటుంది. ఫాస్ట్ బౌలర్లు ఆరంభంలో కాస్త స్వింగ్ రాబట్టవచ్చు. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపవచ్చు. సాధారణంగా ఇక్కడ టాస్ గెలిచిన జట్లు Dew కారణంగా ఛేజింగ్‌ను ఇష్టపడతాయి.
* ఇవాళ ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.