News September 27, 2024

అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి: డిప్యూటీ సీఎం

image

AP:ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలని డిప్యూటీ CM పవన్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టాలి. స్థానిక MLAలు, MPలు, MLCలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు సంబంధించి 13,326 గ్రామాల్లో గ్రామసభలు పెట్టి తీర్మానాలు చేశారు’ అని తెలిపారు.

Similar News

News November 20, 2025

అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

image

ఆటోఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఇమ్యూన్‌ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్‌) అంతే బలంగా ఉంటాయి.

News November 20, 2025

ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు: సజ్జనార్

image

TG: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించినా, దాడులు చేసినా చట్ట ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం కుమిలి పోవాల్సి వస్తుందని ప్రకటన జారీ చేశారు.

News November 20, 2025

BSNL.. రూ.2,399కే ఏడాదంతా..!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే ఏడాది రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నట్లు పేర్కొంది. రూ.2,399తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 2GB డేటా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చని ట్వీట్ చేసింది. కాగా జియో, ఎయిర్‌టెల్ ఏడాది ప్లాన్స్ రూ.3,500కు పైగానే ఉన్నాయి. అయితే BSNL నెట్‌వర్క్ మెరుగుపడాలని, అది సరిగా లేకుంటే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా లాభం లేదని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.