News December 2, 2024
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్?

మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ పేరును BJP అధిష్ఠానం దాదాపుగా ఖరారు చేసినట్టు PTI తెలిపింది. CM ఎంపిక విషయంలో మహాయుతిలో గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. శిండేను బుజ్జగించే వరకు బీజేపీ అధిష్ఠానం పెద్ద కసరత్తే చేసింది. ఎట్టకేలకు ఫడణవీస్‌ను CMగా నిర్ణయించిన బీజేపీ సోమవారం నాటి శాసనసభాపక్ష సమావేశంలో అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.
Similar News
News March 31, 2026
సల్మాన్ సరసన నయన్.. బ్లాక్‌బస్టర్ కొడతారా?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమాలో ఫిమేల్ లీడ్ కన్ఫర్మ్ అయింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. SVC బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది. నయన్ ఇప్పటికే షారుఖ్ ‘జవాన్’తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో సల్మాన్ మూవీపై బజ్ పెరిగింది.
News March 31, 2026
‘భస్మాసుర హస్తం’ అంటే?

ఉపకారం చేసినవాడికే అపకారం తలపెట్టే సందర్భంలో ‘భస్మాసుర హస్తం’ జాతీయాన్ని ఉపయోగిస్తాం. పురాణాల్లో భస్మాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకొని, తన చేతిని ఎవరి తలపై పెడితే వారు భస్మం అయిపోవాలనే వరం పొందుతాడు. అయితే దాన్ని శివుడిపైనే పరీక్షించాలనుకుంటాడు. చివరికి విష్ణుమూర్తి ‘మోహిని’ అవతారమెత్తి భస్మాసురుడి చేయిని అతని నెత్తిన పెట్టుకొనేలా చేసి హతం చేస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 31, 2026
పోలీసుల అండతో TDP గూండా రాజ్యం: జగన్

AP: పోలీసుల అండతో TDP గూండా రాజ్యం నడుపుతోందని YCP చీఫ్ YS జగన్ దుయ్యబట్టారు. గురజాల నియోజకవర్గ నేతలు జగన్‌ను తన నివాసంలో కలిశారు. TDP మూకలు దాడులు చేస్తున్నాయని, FEBలో ఇద్దరిని చంపారని తెలిపారు. దీనిపై జగన్ మాట్లాడుతూ వారి దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొందామని, వ్యవస్థను దిగజార్చేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ అందిస్తుందని భరోసా ఇచ్చారు.


