News December 5, 2024
దేవేంద్ర ఫడణవీస్ పొలిటికల్ బయో

సమర్థ నాయకుడిగా పేరొందిన దేవేంద్ర ఫడణవీస్ 1970 జులై 22న నాగ్‌పూర్‌లో జన్మించారు. ABVPతో రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. 1992లో నాగ్‌పూర్ కార్పొరేషన్‌కు కార్పొరేటర్‌గా ఎన్నికైన పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కారు. 1999లో నాగ్‌పూర్ సౌత్-వెస్ట్ MLAగా గెలిచారు. ఐదుసార్లు ఓటమెరుగలేదు. 2014లో మొదటిసారి CM అయ్యారు. 2019లో 2వసారి CMగా ప్రమాణం చేసినా అనంతర పరిణామాలతో 5 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది.
Similar News
News January 17, 2026
U-19WC: భారత్ స్కోర్ ఎంతంటే?

U-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టులో కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) మరోసారి ఫెయిల్ అయ్యారు. మరో ఓపెనర్ సూర్యవంశీ 72, అభిజ్ఞాన్ కుందు 80 రన్స్‌తో రాణించారు. మధ్యలో వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచును 49 ఓవర్లకు కుదించారు. మరి భారత్ ఈ టార్గెట్‌ను కాపాడుకుంటుందా? COMMENT
News January 17, 2026
పిల్లల్లో ఆటిజం ఉందా?

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.
News January 17, 2026
కేసీఆర్ నాకు శత్రువు కాదు: రేవంత్

TG: తనకెవరూ శత్రువులు లేరని, శత్రువు అనుకున్న వ్యక్తిని 2023లో బండకేసి కొట్టానని పాలమూరు సభలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ‘ఆయన నడుము విరిగి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే నేనెందుకు శత్రువు అనుకుంటా. ఆయన లేచి సరిగ్గా నిలబడ్డప్పుడు మాట్లాడతా. మహిళలకు అన్యాయం చేసేవాళ్లు, విద్యార్థులకు నష్టం కలిగించేవాళ్లు, చదువుకోకుండా ఊరిమీద పడి తిరిగేవాళ్లు, పేదరికమే నా అసలైన శత్రువులు’ అని వ్యాఖ్యానించారు.


