News February 11, 2025
తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో నిన్నటితో పోల్చితే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. ఇవాళ టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం(నిన్న 15గంటలు) పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,169 మంది దర్శించుకోగా, వారిలో 24,559 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Similar News
News November 26, 2025
ప్రతి 10 నిమిషాలకో మహిళ హత్య: ఐరాస

ప్రతి 10 నిమిషాలకు భర్త, కుటుంబ సభ్యుల చేతుల్లో ఒక మహిళ హత్యకు గురవుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 83 వేల మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారని చెప్పింది. వీరిలో 60% మంది పార్ట్నర్లు లేదా ఫ్యామిలీ మెంబర్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. సగటున రోజుకు 137 మంది మహిళలు కుటుంబసభ్యులు లేదా భాగస్వామి చేతుల్లోనే హత్యకు గురయ్యారని తెలిపింది.
News November 26, 2025
సర్పంచ్ ‘మేడం’!

TG: రాష్ట్రంలోని పంచాయతీల్లో 46% సర్పంచ్ స్థానాలు మహిళలకే దక్కడం విశేషం. మొత్తం 12,728 గ్రామాల్లో 5,849 అతివలకు కేటాయించారు. వీటిలో ST మహిళ-1,464, ST జనరల్-1,737, SC మహిళ-928, SC జనరల్-1,182, BC మహిళ-968, BC జనరల్-1,210, UN మహిళ-2,489, UN జనరల్-2,757 ఉన్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 404 గ్రామాలు ఆడవాళ్లకు కేటాయించారు. అటు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో సర్పంచ్ స్థానాలు పూర్తిగా STలకే దక్కాయి.
News November 26, 2025
‘అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు’

సమయం చూసి వ్యవసాయం చేయాలి. అంటే, వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిశీలించి సాగును ప్రారంభించాలి. భూమికి, వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పంటను వెయ్యాలి. సమయం దాటితే పంట చేతికి రాదు, శ్రమ కూడా వృథా అవుతుంది. అలాగే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సమయాన్ని సరిగ్గా అంచనా వేసి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పడం ఈ సామెత ఉద్దేశం.


