News February 11, 2025

కుంభామేళాకు పోటెత్తనున్న భక్తులు.. అధికారుల కీలక నిర్ణయం

image

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్‌రాజ్ మొత్తం నో వెహికల్ జోన్‌గా మారుస్తామని తెలిపారు. కాగా కుంభమేళాలో రోజూ దాదాపు 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారుల అంచనా.

Similar News

News January 6, 2026

పిల్లలకు తేనె ఎప్పుడు ఇవ్వాలంటే?

image

పిల్లలకు ఒక సంవత్సరం వయస్సు వచ్చిన తర్వాత, వారి జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అప్పుడు తేనె ఇవ్వడం సురక్షితం. కానీ అప్పుడు కూడా దీనిని తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఏదైనా కొత్త ఆహారం మాదిరిగా ముందుగా కొద్దిగా ప్రయత్నించి చూడాలి. పిల్లల గొంతుకు ఉపశమనం కలిగించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇచ్చే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. దానికి బదులు తల్లి పాలు, సూప్‌లు, జ్యూసులు ఇవ్వడం మంచిది.

News January 6, 2026

31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

image

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు దర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,650మంది భక్తులు దర్శించుకున్నారు. 23,331మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.4.08కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.

News January 6, 2026

కిలో చికెన్ రూ.320.. మరింత పెరిగే అవకాశం!

image

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చికెన్ ధర స్కిన్‌లెస్ కిలోకి రూ.320 వరకు ఉంది. చాలాకాలంగా పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండటంతో చాలామంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. డిమాండుకు తగ్గట్లు సప్లయ్ లేకపోవడం వల్లే ధరలు ఇంతలా పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అటు కోడిగుడ్డు ధర కూడా రూ.8గా ఉంది.