News March 24, 2025

31 కంపార్టు‌మెంట్లలో శ్రీవారి భక్తులు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని
31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,198 మంది దర్శించుకోగా, 25,665 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Similar News

News January 1, 2026

కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు: బాలకిష్టారెడ్డి

image

TG: కాలం చెల్లిన సిలబస్‌ను పక్కన పెట్టి, మార్కెట్‌కు అవసరమైన సబ్జెక్టులు అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ‘విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేలా సులభమైన పద్ధతిలో ఇంగ్లిష్ పాఠ్యాంశాలను రూపొందించాం. సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఆధునిక టెక్నాలజీతో లింక్ చేశాం. ఉపాధి దొరికే కోర్సులకే ప్రయారిటీ ఇస్తాం. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచుతాం’ అని తెలిపారు.

News January 1, 2026

న్యూఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటున్నారా?

image

న్యూఇయర్ అనగానే కొత్త ఆశలు, సంతోషాలు. ఈ సందర్భంగా చాలామంది కొత్త తీర్మానాలు తీసుకుంటారు. కానీ ఆ దిశగా చేసే ప్రయత్నాలు నాలుగురోజులకే పరిమితం అవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు మానసిక నిపుణులు. పట్టుదల ఉండాలేగానీ అనుకున్నవి సాధించడం కష్టమేం కాదు. స్లో అండ్ స్టడీ విన్స్ బాటలోనే పయనించాలి. ✍️ న్యూఇయర్ రిజల్యూషన్స్ టిప్స్ గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 1, 2026

నిద్ర లేవగానే అస్సలు చూడకూడనివి..

image

నిద్ర లేవగానే చూసే కొన్ని దృశ్యాలతో ప్రతికూల ఫలితాలుంటాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. విరబోసుకున్న జుట్టుతో ఉన్న మహిళను, బొట్టు లేని ఆడపిల్లను, అశుభ్రంగా ఉన్న ప్రదేశాలను చూడటం అశుభంగా పరిగణిస్తారు. తద్వారా మనసులో ప్రతికూల ఆలోచనలు ఏర్పడి, పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయట. ఉదయం లేవగానే శుభప్రదమైన వాటిపై దృష్టి సారిస్తే ఆ రోజంతా ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా గడపవచ్చని పండితులు సూచిస్తున్నారు.