News January 8, 2025
భక్తులు మాస్కులు ధరించాలి: TTD ఛైర్మన్
AP: జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. 10న ఉ.4:30కు ప్రొటోకాల్, వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ‘అన్ని ప్రత్యేక దర్శనాలను 10రోజులు రద్దు చేశాం. టికెట్లు లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడొద్దు. 3K CC కెమెరాలతో నిఘా ఉంచాం. hMPV అలజడి నేపథ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలి’ అని ఛైర్మన్ కోరారు.
Similar News
News January 9, 2025
మైత్రీ మూవీ మేకర్స్పై చర్యలు తీసుకోండి: అడ్వకేట్
మైత్రీ మూవీ మేకర్స్, జై హనుమాన్ చిత్ర యూనిట్పై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ తిరుమలరావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. జై హనుమాన్ మూవీ టీజర్లో హనుమంతుడిని కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఆరోపించారు. టీజర్లో హనుమంతుడికి బదులు రిషబ్ శెట్టి ముఖం చూపించడంతో భవిష్యత్ తరాలకు హనుమాన్ అంటే ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
News January 9, 2025
ప్రియాంక, ఆతిశీపై కామెంట్స్.. రమేశ్ బిధూరీ ఎమ్మెల్యే సీటుకు ఎసరు!
కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ, ఢిల్లీ CM ఆతిశీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP నేత రమేశ్ బిధూరీపై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆయనను తప్పించి, మహిళా అభ్యర్థిని నిలపాలని చూస్తున్నట్లు సమాచారం. కాగా CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారని, తాను MLAగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా మారుస్తానని రమేశ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
News January 9, 2025
హెల్మెట్ ధారణలో పురోగతి: హైకోర్టు
AP: ప్రతి 10 మంది ద్విచక్రవాహనదారుల్లో ముగ్గురు హెల్మెట్ ధరిస్తున్నారని హైకోర్టు తెలిపింది. తమ ఆదేశాలతో చేపట్టిన చర్యల వల్ల పురోగతి కనిపిస్తోందని సంతృప్తి వ్యక్తం చేసింది. గత 20 రోజుల్లో రూ.95 లక్షల చలాన్లు వసూలు చేశారని, ఫైన్లు విధించడమూ పెరిగిందని వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధరించకపోవడం జరిగే నష్టాలను పత్రికలు, టీవీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.