News November 25, 2024
శబరిమలలో పోటెత్తిన భక్తజనం

శబరిమల ఆలయానికి భక్తజనం రద్దీ కొనసాగుతోంది. సీజన్ కావడంతో స్వాములు తండోపతండాలుగా అయ్యప్పను దర్శించుకుంటున్నారు. తొలి 9రోజుల్లో సుమారు 6 లక్షలమంది భక్తులు కొండకు వచ్చారని అంచనా. గత ఏడాది ఇదే కాలంలో 3 లక్షల పైచిలుకు భక్తులు మాత్రమే వచ్చారని, ఈసారి రద్దీ చాలా ఎక్కువగా ఉందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తజనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.
News December 6, 2025
ESIలో చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ

ESIC తీసుకొచ్చిన SPREEలో కంపెనీల యజమానులు, ఉద్యోగులు చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ. దీనివల్ల ఇరువురికీ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నీ అందుతాయి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగిన యజమానులు www.esic.gov.inలో నమోదు చేసుకోవచ్చు. యజమాని ప్రకటించిన రోజు నుంచే రిజిస్ట్రేషన్ చెల్లుతుంది. మునుపటి రోజులకు తనిఖీ ఉండదు. జీతం నెలకు రూ.21వేల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులు అర్హులు.
News December 6, 2025
స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా?

సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే గర్భం కాకుండా, గతంలో సిజేరియన్ చేసిన కుట్టు వద్ద ఏర్పడటాన్ని స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది సుమారు రెండువేల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందంటున్నారు నిపుణులు. ఈ గర్భం కొనసాగితే తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గర్భాశయపు కుట్టు తెరుచుకోవడం, గర్భాశయం చీలిపోవడం వంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.


