News August 12, 2025

రికార్డులు కొల్లగొట్టిన డెవాల్డ్ బ్రెవిస్

image

AUSతో 2వ T20లో సౌతాఫ్రికా బ్యాటర్ బ్రెవిస్(125*) విధ్వంసం సృష్టించారు. దీంతో SA తరఫున అత్యధిక T20 వ్యక్తిగత స్కోర్(గతంలో డుప్లెసిస్ 119 రన్స్) కొట్టారు. AUSపై ఫాస్టెస్ట్ సెంచరీ 41బంతుల్లో(గతంలో కోహ్లీ 52బాల్స్), SA తరఫున సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు(గతంలో రిచర్డ్ లెవి 24Y). కాగా బ్రెవిస్ IPLలో CSKకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News August 13, 2025

రాష్ట్రమంతటా రెండు రోజులు రెడ్ అలర్ట్

image

TG: రాష్ట్రమంతటికీ ఇవాళ, రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. MUL, భద్రాద్రి, BPL, KMM, యాదాద్రి, మల్కాజ్‌గిరి, MDK, VKB, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేశామన్నారు. HYD, HNK, ADB, JNG, కామారెడ్డి, ASF, MHBD, MNCL, రంగారెడ్డి, NLG, SDP, WGL జిల్లాలకు ఆరెంజ్, నిర్మల్, NZB, JGL, SRCL, PDP, KNR జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.

News August 13, 2025

‘కూలీ’కి తొలిరోజే రూ.వంద కోట్లు: సినీవర్గాలు

image

రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ సినిమా విడుదలైన తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీవర్గాలు అంచనా వేశాయి. తొలి వీకెండ్‌కు ప్రీసేల్స్‌తోనే ఈ చిత్రానికి రూ.110 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ జరిగిందని తెలిపాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో $2M క్రాస్ చేయడాన్ని గుర్తుచేస్తున్నాయి. రేపటి వరకూ బుకింగ్స్, డైరెక్ట్ సేల్స్ ద్వారా తొలిరోజు రూ.వంద కోట్లు రావొచ్చని పేర్కొంటున్నాయి.

News August 13, 2025

అతి భారీ వర్షాలు.. అవసరమైతేనే బయటకు వెళ్లండి

image

హైదరాబాద్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా నార్త్ GHMC ఏరియాలో 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని హెచ్చరించింది. ఈక్రమంలో అవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.