News September 30, 2024
దేవర సునామీ.. 3 రోజుల్లో రూ.304 కోట్లు

జూ.ఎన్టీఆర్-జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.304 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. మరో వారంలో రూ.500 కోట్ల మార్క్కు చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, శ్రుతి మారథే, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
Similar News
News January 11, 2026
మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు

TG: మేడారం జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అన్ని రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. TTD కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రి, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లు, మొత్తం 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 అంబులెన్సులు, 3,199 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
News January 11, 2026
2.9°Cకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీ నగరంలో 4.8°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. అటు సౌత్ ఢిల్లీలోని అయా నగర్లో 2.9°C ఉష్ణోగ్రతతో ప్రజలు వణికిపోయారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీల వద్దే ఉంటుందని పేర్కొంటూ IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News January 11, 2026
కోడి పందేలను అడ్డుకోవడం సాధ్యమేనా?

AP: సంక్రాంతికి కోడి పందేలను, జూదాన్ని అడ్డుకోవాలని <<18824857>>హైకోర్టు<<>> ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి అంటే పిండి వంటలే కాదు కోడి పందేలు కూడా మన సంప్రదాయమేనని కొందరు వాదిస్తుంటారు. ఏటా సంక్రాంతికి వీటిపై ఆంక్షలు పెట్టినా కట్టడి చేయడం అంత సులభమయ్యేది కాదు. ఈసారి స్వయానా Dy.CM పవన్ సైతం సంక్రాంతి అంటే జూదం అన్న భావన మారాలని పేర్కొన్నారు. మరి ఈ సంక్రాంతికి కోడిపందేలను అడ్డుకోవడం సాధ్యమేనా? Comment.


