News August 10, 2025
రేపటి నుంచి నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

TG: ఆగస్టు 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో మాత్రల పంపిణీ చేస్తామని, 1-19 సంవత్సరాలున్న వారంతా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించి, రక్తహీనతను అధిగమించేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు ఇవి దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.
Similar News
News August 10, 2025
ముగిసిన ‘ఆడుదాం ఆంధ్ర’ స్కామ్ విచారణ

AP: గత ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో జరిగిన స్కామ్‌పై విచారణ ముగిసింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును త్వరలో విజిలెన్స్ అధికారులు డీజీపీకి సమర్పించనున్నారు. కాగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్స్, ఈవెంట్స్ పేరిట అవినీతి జరిగిందనే ఆరోపణలతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
News August 10, 2025
18 ఏళ్లు దాటాయా? అయితే..

ఇటీవల 30 ఏళ్లలోపు యువతలోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఆడుతూ, జిమ్, డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోతున్నారు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, సిగరెట్, మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం కూడా గుండెపోటు మరణాలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News August 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. BIG UPDATE

TG: పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్‌ను రద్దు చేసే ఛాన్సున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.