News October 13, 2025
విమానాలు తనిఖీ చేయండి.. AIR INDIAకి DGCA ఆదేశం

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానాల్లో ర్యామ్ ఎయిర్ టర్బైన్(RAT) సిస్టమ్‌ను పరిశీలించాలని DGCA ఆదేశించింది. ఇటీవల AIR INDIA డ్రీమ్ లైనర్ ఫ్లైట్‌లో అకారణంగా RAT యాక్టివేట్ అయ్యింది. సాధారణంగా రెండు ఇంజిన్స్ ఫెయిలైనప్పుడే ఇది యాక్టివేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే DGCA దర్యాప్తు చేపట్టింది. ఇలాంటి ఘటనలు, దానిని రెక్టిఫై చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటో చెప్పాలని బోయింగ్ సంస్థను కూడా కోరింది.
Similar News
News October 13, 2025
నేడు విధుల్లోకి టూరిస్టు పోలీసులు

TG: రాష్ట్రంలోని టూరిస్ట్ పోలీస్ వ్యవస్థ అమల్లోకి రానుంది. శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది టూరిస్టు పోలీసులు నేడు విధుల్లో చేరనున్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు రక్షణ కల్పించేలా పలు అంశాలపై వీరికి శిక్షణ ఇచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలైన యాదాద్రి, భద్రాచలం, కీసరగుట్ట, సోమశిల తదితర ఆలయాలతో పాటు చార్మినార్, గోల్కొండ, అనంతగిరి హిల్స్ వంటి సందర్శక ప్రాంతాల్లో వీరు అందుబాటులో ఉంటారు.
News October 13, 2025
ఐదేళ్లలో 30శాతానికి మహిళా ఉద్యోగులు: SBI

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI 2030కల్లా మహిళా ఉద్యోగుల వాటాను 30శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 2.40 లక్షల సిబ్బందిలో వీరి వాటా 27%గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అనువైన పని వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళలకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వివరించారు.
News October 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 6 అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.gov.in/