News January 22, 2026

DGEMEలో ఉద్యోగాలు

image

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్(DGEME) 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు FEB 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.indianarmy.nic.in/

Similar News

News March 12, 2026

రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాలి: కోలీవుడ్

image

తమిళ దిగ్గజ నటుడు MGRపై ఇటీవల రాజేంద్రప్రసాద్ చేసిన వివాదాస్పద <<19346659>>వ్యాఖ్యలపై<<>> కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమిళ ఆరాధ్య దైవాన్ని కించపరచడం తగదని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రముఖ యాక్టర్స్ నాజర్, విశాల్ డిమాండ్ చేశారు. కాంతారావు గొప్ప నటుడని, కానీ ఆయన్ని పొగిడే క్రమంలో మరో యాక్టర్‌ను తక్కువ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరారు.

News March 12, 2026

సాఫ్ట్‌వేర్ కంపెనీలను రీప్లేస్ చేసే ‘మాక్రోహార్డ్’!

image

సాఫ్ట్‌వేర్ కంపెనీలు చేయగలిగే అన్ని పనులను చక్కబెట్టే AI టూల్స్‌ను సిద్ధం చేయడం కోసం మస్క్ మాక్రోహార్డ్ ప్రాజెక్టును ప్రకటించారు. టెస్లా డిజిటల్ ఆప్టిమస్, గ్రోక్ LLM టెక్‌ను వాడి వీటిని తయారు చేయనున్నట్లు చెప్పారు. చౌకగా దొరికే టెస్లా AI4 చిప్స్‌ను వాడనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ కుదిపేస్తున్న తరుణంలో మస్క్ ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

News March 12, 2026

OTD: భారతదేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఉగ్రదాడి!

image

భారత్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లకు నేటితో 33 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజున దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ ముఠా జరిపిన 12 పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 1,400 మంది క్షతగాత్రులయ్యారు. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, ఎయిర్ ఇండియా భవన్ వంటి కీలక ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ మారణహోమం నేటికీ దేశాన్ని కలచివేస్తోంది. దోషి యాకూబ్ మెమన్‌ను 2015లో ఉరితీశారు.