News February 1, 2025

సీఎం చంద్రబాబుతో డీజీపీ గుప్తా భేటీ

image

AP: CM చంద్రబాబుతో నూతన DGP హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీగా తనను ఎంపిక చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కాగా నిన్నటితో మాజీ DGP ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగిసింది. ఆయనను ఏడాది పాటు RTC MDగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News November 17, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

image

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్‌కు తెలుస్తుందని తెలిపారు. సూరత్‌లోని రైల్వే కారిడార్‌లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.

News November 17, 2025

ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News November 17, 2025

ఢిల్లీ పేలుడు: ఏమిటీ డెడ్ డ్రాప్?

image

ఢిల్లీ పేలుడు కేసు నిందితులు ‘డెడ్ డ్రాప్’ ఈ-మెయిల్ విధానం వాడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఒకే మెయిల్ IDతో రహస్యంగా సమాచార మార్పిడి చేసుకోవడమే ‘డెడ్-డ్రాప్’ పద్ధతి. సమాచారాన్ని డ్రాఫ్ట్‌లో సేవ్ చేస్తే, దాన్ని అవతలి వ్యక్తి చూస్తారు. తర్వాత అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు. ఇందులో మెయిల్ పంపడం, రిసీవ్ చేసుకోవడమనేదే ఉండదు. దీన్ని గుర్తించడం చాలా కష్టమని అధికారులు అంటున్నారు.