News December 29, 2024
మా ఫోన్ ఎత్తాలంటే డీజీపీ భయపడుతున్నారు: బొత్స
AP: DGP ద్వారకా తిరుమలరావు బలహీనంగా మారారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో భద్రతావైఫల్యానికి ఎవర్ని బాధ్యుల్ని చేస్తారు? ఈ ప్రభుత్వం ఏమైపోయింది? డీజీపీ మా ఫోన్ ఎత్తాలంటేనే భయపడుతున్నారు. మంత్రి కొండపల్లిపై వార్తలన్నీ తెలుగుదేశం సృష్టి. అభద్రతాభావంతోనే ఇలాంటి ప్రచారాలు చేసి కొండపల్లిని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు.
Similar News
News December 29, 2024
నేను జనసేనలో చేరడం లేదు: తమ్మినేని సీతారాం
AP: తనకు జనసేనలో చేరాల్సిన అవసరం లేదని YCP నేత తమ్మినేని సీతారాం అన్నారు. ‘నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం. నా కుమారుడు ఆస్పత్రిలో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాలవలసకు కొత్త ఇన్ఛార్జిని పెట్టడంతో పార్టీపై ఆయన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
News December 29, 2024
కాంగ్రెస్వి చీప్ పాలిటిక్స్: బీజేపీ
మన్మోహన్ స్మారకార్థం స్థలాన్ని కేటాయించకుండా ఆయన్ను అవమానించారంటూ కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని BJP మండిపడింది. అంత్యక్రియల్లో మోదీ, అమిత్ షా కేంద్రంగా మీడియా కవరేజ్ చేశారనేది అవాస్తవమని, భద్రతా సంస్థలు కవరేజీపై ఆంక్షలు విధించాయని పేర్కొంది. సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలను ఖండించింది. ప్రొటోకాల్ ప్రకారం ఫస్ట్ రోలో Ex PM కుటుంబ సభ్యులకు 5 కుర్చీలు కేటాయించారంది.
News December 29, 2024
రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నింగ్
TG: సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పండగ తర్వాత ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.