News September 13, 2024
డీజీపీ జితేందర్ వార్నింగ్

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించేది లేదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఎలాంటి ఆందోళనలకు అవకాశం లేదని, గొడవలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతలపై రాజీపడొద్దని సీపీలకు సూచించారు.
Similar News
News October 18, 2025
కల్తీ మద్యం కేసు: ప్రధాన నిందితుడితో జోగి రమేశ్ ఫొటోలు!

AP: కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, అతడి సోదరుడు జగన్మోహన్ రావుతో మాజీ మంత్రి జోగి రమేశ్ కలిసి ఉన్న ఫొటోలు బయటపడ్డాయి. ఓ వేడుకలో వీరు పక్కపక్కనే కూర్చున్నారు. కాగా జనార్దన్తో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రమేశ్ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు రమేశ్ ఆధ్వర్యంలోనే కల్తీ మద్యం తయారు చేశామని జనార్దన్ వెల్లడించడం గమనార్హం.
News October 18, 2025
‘వృక్షరాణి’ తులసి తిమ్మక్క గురించి తెలుసా?

మనకెంతో ఇచ్చిన ప్రకృతిని కాపాడేందుకు ఒక్క మొక్కనైనా నాటలేకపోతున్నాం. కానీ కర్ణాటకకు చెందిన 113ఏళ్ల తులసి తిమ్మక్క తన జీవితాన్నే మొక్కలు నాటేందుకు త్యాగం చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గత 80 ఏళ్లలో ఈ ‘వృక్షరాణి’ 8,000 కంటే ఎక్కువ మొక్కలు నాటి బీడు భూములను పచ్చగా మార్చారు. పిల్లలు లేని లోటును తీర్చుకునేందుకు ఆమె చెట్లను దత్తత తీసుకున్నారు. ఆమెను కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
News October 18, 2025
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్ను సవరిస్తూ <