News October 11, 2025
ధనధాన్య కృషి యోజన పథకం ప్రారంభం

దేశంలోని వ్యవసాయ రంగ ఉత్పాదకతను పెంచేందుకు ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జాతీయ సగటుకంటే పంట ఉత్పాదకత తక్కువ ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో సాగునీటి సామర్థ్యం, పంట నిల్వ, రుణ సదుపాయం, పంటమార్పిడి, సాగులో వైవిధ్యం పెంచడానికి కేంద్రం ఏటా రూ.24 వేల కోట్ల చొప్పున ఆరేళ్లు ఖర్చు చేస్తుంది. దీని వల్ల 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి కలుగుతుంది.
Similar News
News October 11, 2025
తెలంగాణకు ఐకానిక్‌గా టీస్క్వేర్ నిర్మాణం: రేవంత్

TG: HYDలోని రాయదుర్గం సమీపంలో టీస్క్వేర్ నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందులో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల ఔట్‌లెట్లు ఉండాలని చెప్పారు. తెలంగాణకు ఐకానిక్‌గా ఉండేలా NOV నెలాఖరు నుంచి పనులు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఏఐ హబ్ కోసం ప్రముఖ AI సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
News October 11, 2025
ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఇదేనా?

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది. ఇందులో ప్రభాస్‌కు జంటగా ఇమాన్వి నటిస్తున్నారు. షూటింగ్ 60% కంప్లీట్ అయినట్లు సమాచారం. దేశభక్తి అంశాలతో ఈ మూవీ రూపొందుతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News October 11, 2025
AI వినియోగంపై ఐటీ కంపెనీల వేధింపులు

సిబ్బందిని కుదించేందుకు IT కంపెనీలు ఏఐ టూల్స్ వాడకాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. అలా చేయని ఉద్యోగుల్ని వేధిస్తున్నాయని Redditలో పోస్టులు వైరల్‌గా మారాయి. ‘మా CEO 20 ఏఐ టూల్స్ సిద్ధంచేశారు. వాటిని వాడనందుకు సీనియర్‌ను వేధించారు. అసోసియేట్లను ఉంచి డెవలపర్లను తొలగిస్తామన్నారు’ అని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. కాగా ఏఐతో అన్నీసాధ్యం కాదని, తమనూ ఇలాగే తొలగించి ఇపుడు మళ్లీ రమ్మంటున్నారని మరో నెటిజన్ అన్నాడు.