News October 10, 2025
రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభం

దేశంలో వ్యవసాయ రంగ ఉత్పాదకతను మరింత పెంచేందుకు కేంద్రం ప్రకటించిన ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. జాతీయ సగటుకంటే తక్కువగా పంట ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపికచేశారు. ఈ జిల్లాల్లో సాగునీటి వ్యవస్థ, పంట నిల్వ సామర్థ్యం, రుణసదుపాయం, పంటసాగులో వైవిధ్యం పెంచడానికి కేంద్రం చేయూతనందిస్తుంది. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయంతో ఆరేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తారు.
Similar News
News October 10, 2025
నోబెల్ కమిటీపై వైట్‌హౌజ్ విమర్శలు

ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై వైట్‌హౌజ్ స్పందించింది. ‘తాము శాంతి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని మరోసారి నోబెల్ కమిటీ నిరూపించింది. అయినా ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు ఆపేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన మానవతావాది. శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడతారు’ అని వైట్‌హౌజ్ అధికార ప్రతినిధి స్టీవెన్ చుయెంగ్ ‘X’ వేదికగా విమర్శించారు.
News October 10, 2025
నారదుని భక్తి సూత్రాలు – 5

‘యత్ప్రాప్య నకించి ద్వాంఛతిన శోచతి
న ద్వేష్టి న రమతే నో త్సాహీ భవతి’ నారదుని భక్తి సూత్రాల్లో ఇది ఐదవది. దీనర్థం.. ఎవరైతే పరమాత్మ ప్రేమను పొందుతారో, వారు ఆ తర్వాత ఏమీ కోరుకోరు. ఎంతటి కష్టమొచ్చినా బాధపడరు. ఎవర్నీ ద్వేషించరు. చిన్న సంతోషాలకు పొంగిపోరు. అనవసర విషయాల పట్ల ఉత్సాహం చూపరు. అంటే.. దైవ దర్శనం తర్వాత మనిషి సుఖ-దుఃఖాలకు అతీతంగా, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడని అర్థం. <<-se>>#NBS<<>>
News October 10, 2025
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియెట్-2025 పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగుస్తుండటంతో ఈనెల 22 వరకు దాన్ని బోర్డు పొడిగించింది. జనరల్, వొకేషనల్ కోర్సులు చదివే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ప్రయివేటు అభ్యర్థులు గడువులోగా ఫీజు చెల్లించాలని సూచించింది. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇదే చివరి ఛాన్సు అని మరోసారి పొడిగింపు ఉండదని ఇంటర్ బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా స్పష్టం చేశారు.