News March 22, 2024
నేటి నుంచే ధనాధన్ ఐపీఎల్
నేటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ధనాధన్ ఆటతో ఆటగాళ్లు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించనున్నారు. రెండు నెలలకుపైగా జరగనున్న ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్కే-ఆర్సీబీ మధ్య జరగనుంది. అలాగే ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ అదిరిపోనుంది. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోనూ నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు.
Similar News
News November 1, 2024
కులగణన.. మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు
TG: ఈ నెల 6 నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 80వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. 36,559 మంది SGTలతో పాటు 3414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు సహా మరికొందరిని ఇందుకోసం వినియోగించనుంది. అయితే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే SGTలకు మినహాయింపు ఇచ్చింది. ప్రైమరీ స్కూళ్లల్లో ఈ 3 వారాల పాటు ఉదయం 9 నుంచి మ.ఒంటి గంట వరకే క్లాసులు జరుగుతాయి.
News November 1, 2024
వేడి నూనె పాత్రలో పడ్డ ఫోన్.. బ్యాటరీ పేలి వ్యక్తి మృతి
వంట చేస్తూ చేతిలో పట్టుకున్న ఫోన్ వ్యక్తి ప్రాణం తీసింది. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఓ వ్యక్తి వంట చేస్తున్న సమయంలో చేతిలో ఉన్న ఫోన్ జారి వేడివేడి నూనె పాత్రలో పడింది. దీంతో ఒక్కసారిగా బ్యాటరీ పేలడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్ తరలిస్తుండగా సింధ్ నదిపై ట్రాఫిక్ జాంతో అంబులెన్స్ ఆలస్యంగా ఆస్పత్రికి చేరుకుంది. బాధితుడు అప్పటికే మృతి చెందాడు.
News November 1, 2024
టీటీడీ పాలకమండలిలో మరికొందరికి చోటు
AP: బీఆర్ నాయుడు ఛైర్మన్గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది. జి.భాను ప్రకాశ్ రెడ్డిని సభ్యుడిగా, దేవదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్, TUDA ఛైర్మన్, TTD ఈవోలను ఎక్స్అఫిషియో మెంబర్లుగా పాలకమండలిలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.