News October 31, 2024

ధనత్రయోదశి: ఫస్ట్ టైమ్ బంగారాన్ని ఓడించిన వెండి

image

భారత నగల మార్కెట్ చరిత్రలో తొలిసారి వెండి అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ధనత్రయోదశి వేళ కస్టమర్లు బంగారం కన్నా దీనినే ఎక్కువ కొనుగోలు చేశారు. ‘గత సీజన్‌తో పోలిస్తే సిల్వర్ రేట్ 40% పెరిగినా అమ్మకాలు 30-35% ఎగిశాయి. ఇలాంటి డిమాండ్ మునుపెన్నడూ చూడలేదు. వ్యాపార ప్రయోజనం వల్ల సిల్వర్‌పై పెట్టుబడి ఓ మంచి అవకాశంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని IBJA జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా తెలిపారు.

Similar News

News October 31, 2024

హైదరాబాద్‌ను అమరావతి బీట్ చేస్తుందా? KTR రిప్లై ఇదే

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు Xలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. చంద్రబాబు నేతృత్వంలో అమరావతి ఐటీ సిటీగా బలపడి హైదరాబాద్‌‌ను అధిగమిస్తుందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న లీడర్ కానీ HYD స్వంతగానే అభివృద్ధి చెందింది. గతంతో పోలిస్తే ఐటీలో బెంగళూరును దాటేసింది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు’ అని అన్నారు.

News October 31, 2024

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే..

image

➢ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ రూల్ అమలు
➢రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు తగ్గింపు
➢SBI క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలు 3.75శాతానికి పెంపు
➢ICICI క్రెడిట్ కార్డు ఫీజు, క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ విధానంలో మార్పులు(నవంబర్ 15 నుంచి అమలు)
➢ఇండియన్ బ్యాంక్ ఎఫ్‌డీ స్కీమ్ గడువు Nov 30 వరకు పెంపు

News October 31, 2024

మ‌రో ఐదు రోజుల్లో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు Nov 5న పోలింగ్ జ‌ర‌గనుంది. అమెరిక‌న్లు నేరుగా అధ్య‌క్షుడికి ఓటు వేయ‌రు కాబ‌ట్టి <<14452559>>ఎలక్టర్లను<<>> ఎన్నుకుంటారు. పోలింగ్ త‌రువాత అధ్య‌క్ష అభ్య‌ర్థి గెలుపుపై స్ప‌ష్ట‌త వ‌చ్చినా Dec 16న ఎల‌క్ట‌ర్లు కొత్త అధ్య‌క్ష, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. ఇది అమెరికా అధ్య‌క్షుడి అసలైన ఎన్నిక‌. అనంత‌రం ఈ ఫ‌లితాల‌ను Jan 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త స‌మావేశంలో అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.