News November 17, 2024
మంచి వాళ్లంటే ధనుష్కు ఇష్టం ఉండదు: నయనతార భర్త

అందరూ అనుకుంటున్నట్లు హీరో ధనుష్ అంత మంచివాడు కాదని హీరోయిన్ నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అన్నారు. ఆయనకు మంచి వాళ్లంటే ఇష్టం ఉండదని చెప్పారు. ‘నయనతారకు లీగల్ నోటీసులు పంపడం దుర్మార్గం. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికీ తప్పే. అభిమానులు ఆయన అసలు ముఖం ఏంటో తెలుసుకోవాలి’ అని ఆయన ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేశారు.
Similar News
News December 1, 2025
నేటి నుంచే పార్లమెంట్ వింటర్ సెషన్స్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా, ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలపనున్నారు. తాజా సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు SIRపై ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధం కాగా వాడీవేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
News December 1, 2025
శివుడు ఎలా జన్మించాడో తెలుసా?

సృష్టి కార్యంలో భాగంగా విష్ణువు నుదుటి తేజస్సు నుంచి శివుడు ఆవిర్భవించాడని మనం పురాణాల్లో చదువుకున్నాం. అయితే శివుడు స్వయంభూ అని, ఆయన ఎవరి నుంచి జన్మించలేదని, ఆయనే సర్వానికి మూలమని శివ పురాణం పేర్కొంటుంది. శివుడు ధ్యానంలో రుద్రాక్షమాలను లెక్కిస్తున్నప్పుడు, ఓ రుద్రాక్ష నుంచి విష్ణుమూర్తి జన్మించాడని చెబుతోంది. ఈ భిన్న కథనాలు అంతిమంగా త్రిమూర్తుల ఏకత్వతత్త్వాన్ని చాటిచెబుతున్నాయి.
News December 1, 2025
గణనీయంగా తగ్గిన HIV-AIDS కేసులు

భారత్లో 2010-2024 మధ్య HIV- ఎయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వార్షిక కొత్త కేసుల నమోదులో 48.7% క్షీణత నమోదైనట్లు తెలిపింది. అలాగే ఎయిడ్స్ సంబంధిత మరణాలు 81.4%, తల్లి నుంచి బిడ్డకు సంక్రమణ సైతం 74.6% తగ్గినట్లు వివరించింది. అటు 2020-21లో 4.13కోట్ల ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయగా 2024-25కు ఆ సంఖ్య 6.62కోట్లకు పెంచినట్లు పేర్కొంది.
– నేడు వరల్డ్ ఎయిడ్స్ డే.


