News December 19, 2024
నటుడు చంద్రబాబు బయోపిక్‌లో ధనుష్?

కోలీవుడ్ దివంగత హాస్యనటుడు చంద్రబాబు బయోపిక్ తీసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ గోపాల్ వన్ స్టూడియోస్ సన్నద్ధమవుతోంది. హీరోహీరోయిన్ల కంటే ఎక్కువగా పారితోషికం తీసుకున్న నటుడిగా చంద్రబాబు గుర్తింపు పొందారు. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవల ఆధారంగా చిత్రం తెరకెక్కించనున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ చేస్తారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ధనుష్ ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ చేస్తున్నారు.
Similar News
News December 12, 2025
ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది !

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఓటర్లను ప్రభావితం చేయడం మిగిలింది. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు.
News December 12, 2025
ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి
News December 12, 2025
9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్

AP: VSP ఎకనామిక్ రీజియన్‌పై CM CBN సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలో ఉన్నాయి. APలో 31% విస్తీర్ణం, 23% జనాభాతో GDPలో 30% భాగస్వామ్యం VERదే. గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్‌జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ వంటి 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.


