News November 19, 2024
ధనుష్-నయన్ వివాదం.. రాధిక కీలక వ్యాఖ్యలు

ధనుష్-నయనతార వివాదం నేపథ్యంలో రాధికా శరత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీలో ఆమె విజయ్ తల్లిగా నటించారు. ‘షూటింగ్ సమయంలో ధనుష్ కాల్ చేసి ‘‘అక్కా.. నీకు సిగ్గులేదా?’’ అని అనడంతో షాక్ అయ్యా. ఏమైందని అడిగా. ‘‘విఘ్నేశ్-నయన్ డేటింగ్‌లో ఉన్నట్లు నీకు తెలియదా?’’ అని అడిగాడు. నాకు నువ్వు చెప్పేవరకు తెలియదని చెప్పా’ అని డాక్యుమెంటరీలో రాధిక చెప్పిన వీడియో వైరలైంది.
Similar News
News January 16, 2026
గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడి గెలుపు

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్ MH ‘జల్నా’ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,621 ఓట్ల మెజారిటీతో గెలిచారు. BJP సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2018లో అరెస్టై, 2024 సెప్టెంబర్‌లో కర్ణాటక హైకోర్టు నుంచి పంగర్కర్ బెయిల్ పొందారు. గతంలో అవిభక్త శివసేనలో కార్పొరేటర్‌గా పనిచేశారు.
News January 16, 2026
AIIMS రాయ్‌పూర్‌లో ఉద్యోగాలు

AIIMS రాయ్‌పూర్ 40 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 19న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. MBBS ఉత్తీర్ణతతో పాటు DMC/NMC/స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in
News January 16, 2026
Money Tip: మీకు మీరే శిక్ష వేసుకోండి.. వినూత్న పొదుపు మంత్రం!

మీకున్న చెడు అలవాట్లపై మీరే పన్ను వేసుకోండి. డబ్బు ఆదా చేయడానికి ఇదొక వినూత్న మార్గం. అనవసర ఖర్చు చేసినప్పుడు అంతే మొత్తాన్ని పెనాల్టీగా మీ సేవింగ్స్ అకౌంట్‌లోకి డిపాజిట్ చేయండి. Ex ఒక బర్గర్ కొంటే దానికి సమానమైన డబ్బును వెంటనే అకౌంట్‌కు మళ్లించాలి. ఇలా చేస్తూ వెళ్తే పోగైన డబ్బును బట్టి మీకున్న బ్యాడ్ హాబిట్స్ వల్ల ఎంత నష్టమో తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ అలవడుతుంది. పొదుపు అలవాటవుతుంది.


