News November 20, 2024
నయనతార ఓపెన్ లెటర్‌పై స్పందించిన ధనుష్ తండ్రి
హీరో ధనుష్‌కు నయనతార రాసిన <<14626837>>ఓపెన్ లెటర్‌పై<<>> అతని తండ్రి కస్తూరి రాజా స్పందించారు. ‘మాకు పని ముఖ్యం. అందుకే ముందుకు సాగుతున్నాం. వెన్నుపోటు పొడిచే వారికి సమాధానం చెప్పే సమయం మాకు లేదు. నాలాగే నా కొడుకు దృష్టి కూడా పనిపైనే ఉంటుంది’ అని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దానే’ మూవీ క్లిప్స్ వాడుకున్నందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ నయనతారకు ధనుష్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.
Similar News
News November 20, 2024
ICC ర్యాంకింగ్స్‌లో టాప్-3కి తిలక్ వర్మ
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ICC T20I ర్యాంకింగ్స్‌లో రయ్యుమని దూసుకెళ్లారు. ఒకేసారి ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్3కి చేరుకున్నారు. టాప్1లో ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) ఉండగా 2వ స్థానంలో సాల్ట్(ఇంగ్లండ్) ఉండగా ఆ తర్వాతి స్థానాన్ని తిలక్ కైవసం చేసుకున్నారు. అరంగేట్రం తర్వాత కేవలం 20 మ్యాచుల్లో తిలక్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం. ఇటీవల SAపై వరుస సెంచరీలు చేసిన వర్మ మొత్తం 51.33 సగటుతో 616 రన్స్ చేశారు.
News November 20, 2024
భారత్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు మెస్సీ?
2025లో కేరళతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ 2 మ్యాచ్‌లు ఆడుతుందని ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. ఇందులో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కూడా ఆడతారని చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా కేరళలో ఫుట్‌బాల్‌కు క్రేజ్ ఎక్కువ. భారత్‌లో ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడే కొన్ని రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. మెస్సీ చివరిగా 2011లో ఇండియాలో ఆడారు.
News November 20, 2024
థియేటర్లలోకి వారికి నో ఎంట్రీ!
యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిల్మ్ క్రిటిక్‌లపై తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లలోకి వారిని అనుమతించకూడదని యాజమాన్యాలను కోరింది. రివ్యూల పేరుతో నటీనటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుండటంతో TFPC ఈ నిర్ణయం తీసుకుంది. వీరి రివ్యూలు వేట్టయన్, ఇండియన్ 2, కంగువా చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపింది.