News July 1, 2024

డిప్యూటీ తహశీల్దార్ల చేతికి ధరణి రిజిస్ట్రేషన్లు?

image

TG: భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచేలా ప్రభుత్వం కీలక సంస్కరణలు తేనున్నట్లు తెలుస్తోంది. ధరణి రిజిస్ట్రేషన్ల బాధ్యతలతో తహశీల్దార్ల సమయమంతా అక్కడే గడిచిపోతోంది. దీంతో ఆ బాధ్యతల్ని డిప్యూటీ తహశీల్దార్లకు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. తహశీల్దార్లకు కార్యాలయ నిర్వహణ, భూ సమస్యల పరిష్కారం వంటి ఇతర విధులు ఇవ్వాలని భావిస్తోందట. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 21, 2024

ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపు

image

Jr.NTR ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే రిలీజ్ రోజున(SEP 27) 12AM నుంచి మొత్తం 6షోలు, 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

News September 21, 2024

జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్!

image

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్‌పై పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టును కోరనున్నారు. మరోవైపు జానీపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ కోసం అతడి తరఫు న్యాయవాది పిటిషన్ వేయనున్నారు.

News September 21, 2024

ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి

image

AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఇప్పటికే రెండు బోట్లను తొలగించిన అధికారులు తాజాగా మూడో పడవను బయటికి తీశారు. వీటిని పున్నమి ఘాట్‌కు తరలించారు. ఈ ప్రక్రియకు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈనెల 1న భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజీని ఢీకొట్టాయి. వాటిలో ఒకటి దిగువకు కొట్టుకుపోగా, మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.