News August 9, 2024

యువ రైతు ప్రాణం తీసిన ‘ధరణి’!

image

TG: ‘ధరణి’లో భూమి రిజిస్టర్ కాలేదనే మనస్తాపంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు రాజేశ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. జక్రాన్‌పల్లి మం. అర్గుల్‌కు చెందిన రాజేశ్ వ్యవసాయంతో పాటు వ్యాపారంలో రూ.12 లక్షలు నష్టపోయాడు. తన 2 ఎకరాల భూమిని అమ్మేసి బాకీని తీర్చాలని ప్రయత్నించాడు. ధరణి పోర్టల్‌లో భూమి నమోదు కాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Similar News

News January 18, 2025

సైఫ్‌పై దాడి.. ఈ ప్రశ్నలకు సమాధానమేది?

image

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి ఘటనలో పలు విషయాలు అంతుచిక్కడం లేదు. *ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి దాడి తర్వాత ఎలా తప్పించుకున్నాడు? *బిల్డింగ్‌ లేఅవుట్ అతనికి ముందే తెలుసా? *సైఫ్ ఆటోలోనే ఎందుకు వెళ్లారు? *సైఫ్‌తో పెద్ద వారు కాకుండా 7 ఏళ్ల చిన్నారి ఎందుకు వెళ్లాడు? వంటి ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. నిందితుడు పోలీసులకు చిక్కితే వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News January 18, 2025

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జారీ

image

AP: ఏప్రిల్‌కు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఇవాళ ఉ.10గంటలకు రిలీజ్ చేయనుంది. ఈ సేవల లక్కీడిప్ కోసం ఈ నెల 20న ఉ.10గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 23న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం, ఉ.11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లు జారీ చేయనుంది. 24న ఉ.10 గంటలకు రూ.300 కోటా, మ.3 గంటలకు వసతి గృహ టికెట్లు ఇవ్వనుంది.

News January 18, 2025

బీజేపీ మ్యానిఫెస్టోలోనూ మా పథకాలే: కేజ్రీవాల్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ పథకాలపై విమర్శలు చేస్తూనే BJP చీఫ్ నడ్డా ఉచితాలను ప్రకటించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఉచితాలు హానికరం కాదని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ గతంలో తమపై చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకోవాలన్నారు. తాము అమలు చేస్తున్న పథకాలనే బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని విమర్శించారు.