News March 27, 2024
DHARMAVARAM: ఎవరీ సత్యకుమార్..!

ధర్మవరం బీజేపీ MLA అభ్యర్థిగా ఖరారైన వై.సత్యకుమార్.. రాయలసీమలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. బళ్లారి, మదనపల్లె, బెంగళూరులో విద్యాభ్యాసం చేశారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీవైపు అడుగులు వేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలో ABVPలో కీలకంగా వ్యవహరించారు. 6 భాషలు మాట్లాడే సత్య.. BJP జాతీయ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. అప్పట్లో అధ్వానీ రథయాత్రలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
Similar News
News January 23, 2026
ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యంగా తనిఖీలు

అనంతపురంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో అర్ధరాత్రి వరకు పోలీసులు డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ & లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు.
News January 23, 2026
అనంత: భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో Accenture కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురికి రూ.6.5 లక్షలు, ఐదుగురికి రూ.4.5లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను VC సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించడంపై కళాశాలలో హర్షం వ్యక్తమైంది.
News January 22, 2026
రహదారి భద్రత ప్రతీ పౌరుడి బాధ్యత: విష్ణు చరణ్

రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రతీ పౌరుడి బాధ్యత అని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అనంతపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు, క్రమశిక్షణ పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


