News July 19, 2024
బుధవారం ఢిల్లీలో ధర్నా: జగన్

AP: సీఎం చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు కూడా కోరాం. అనుమతి రాగానే రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులను వారికి వివరిస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
మోగ్లీ మూవీ రివ్యూ&రేటింగ్

ప్రేమించిన యువతి కోసం క్రిమినల్ పోలీస్‌తో హీరో చేసే పోరాటమే మూవీ కథ. రోషన్ యాక్టింగ్, బధిర యువతిగా హీరోయిన్, బండి సరోజ్ నటన మెప్పిస్తాయి. వైవా హర్ష కామెడీ నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్ ఫర్వాలేదు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లవ్‌స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. కర్మ సిద్ధాంతంతో లింక్ పెట్టి సందీప్ రాజ్ కథ అల్లారు.
రేటింగ్:2.25/5
News December 13, 2025
వారితో కేరళ విసిగిపోయింది: మోదీ

తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDA <<18552178>>గెలవడం<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ‘థాంక్యూ తిరువనంతపురం. ఈ గెలుపు కేరళ రాజకీయాల్లో కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు నిశ్చయించుకున్నారు. UDF, LDFతో కేరళ విసిగిపోయింది. వికసిత్ కేరళకు, సుపరిపాలనకు మరో ఆప్షన్‌గా ఎన్డీయేను ప్రజలు చూస్తున్నారు’ అని పలు ట్వీట్లు చేశారు. BJP-NDAకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
News December 13, 2025
TGCABలో ఇంటర్న్‌గా చేరాలనుకుంటున్నారా?

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (<


