News July 19, 2024
ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత

AP: గోదావరికి వరద పోటెత్తుతోంది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.80 అడుగులకు చేరడంతో అధికారులు 175 గేట్లను ఎత్తారు. 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అటు వరద ఉద్ధృతి నేపథ్యంలో లంక గ్రామాలను అప్రమత్తం చేశారు. మరోవైపు గోదావరికి వరద పెరగడంతో దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది.
Similar News
News January 11, 2026
నిర్మలా సీతారామన్‌కు భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలను తీర్చడానికి బహిరంగ మార్కెట్ ద్వారా రూ.70,925 కోట్లు సమీకరించుకునే అనుమతి ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం వివిధ ఏజెన్సీల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) కింద ఉన్న ఈ రుణాలను FRBM పరిధిలోకి తీసుకురావాలని అభ్యర్థించారు.
News January 11, 2026
పాకిస్థాన్‌కు యుద్ధం చేసే ధైర్యం లేదు: మనోజ్ కటియార్

ఇండియాతో నేరుగా యుద్ధం చేసే ధైర్యం పాకిస్థాన్‌కు లేదని వెస్టర్న్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదమే పాక్ ఏకైక ఆయుధమని, పరోక్ష యుద్ధంతోనే భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మానెక్‌షా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ సరిహద్దులో ఉద్రిక్తతలకు అవకాశం ఉందని హెచ్చరించారు. భారత సైన్యం బలం భిన్నత్వంలో ఏకత్వమని అన్నారు.
News January 11, 2026
నితీశ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్‌లు ఈ మేరకు బహిరంగంగా మద్దతు తెలిపారు. రెండు దశాబ్దాలుగా బిహార్ అభివృద్ధికి నితీశ్ చేసిన కృషి ఆయనను భారతరత్నకు అర్హుడిని చేస్తుందని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో జేడీయూ నేత కేసీ త్యాగి సైతం ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.


