News July 20, 2024
ధవళేశ్వరం: సముద్రంలోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు

AP: రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 7.8 అడుగుల నీటిమట్టం ఉండగా.. 3 లక్షల 9వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటు పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 100/175 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 450 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది.
Similar News
News November 26, 2025
కామారెడ్డి: సీతాయిపల్లి అటవీ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు

గాంధారి మండలం సీతాయపల్లి కంచ్మల్ అటవీ ప్రాంతం శివారులో ఇటీవల చిరుత సంచరించడంపై స్థానికంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని అటవీ అధికారులు తెలిపారు. భవానిపేట నుంచి బాన్సువాడకు వెళ్లే రహదారి అటవీ ప్రాంతం ఉన్నందున ఈ రహదారి గుండా ప్రయాణించేవారు సాయంత్రం 5 గంటల తర్వాత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 26, 2025
కామారెడ్డి: కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం

కామారెడ్డి జిల్లా పోలీసు కళా బృందం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కళా ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 200కు పైగా గ్రామాలు, విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించిందని జిల్లా SP రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. స్థానిక భాష, యాసలో ఆటలు-పాటల ద్వారా ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈకార్యక్రమాల వల్ల ప్రజల ఆలోచనా విధానంలో మార్పు కనిపించడం ముఖ్య విజయమని ఎస్పీ పేర్కొన్నారు.