News April 11, 2025
CSK కెప్టెన్గా ధోనీ.. 2022 సీన్ రిపీట్?

CSK కెప్టెన్గా తిరిగి ధోనీని నియమించడంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఓటముల వల్ల ఉద్దేశపూర్వకంగానే యాజమాన్యం ఇలా చేస్తోందని అంటున్నారు. తాజాగా గాయం కారణంతో రుతురాజ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకి అప్పగించిన CSK 2022లోనూ జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గైక్వాడ్ కెప్టెన్సీలో 5 మ్యాచుల్లో 4 ఓడగా.. అప్పుడు జడేజా కెప్టెన్సీలో 8 మ్యాచుల్లో 6 ఓడింది.
Similar News
News April 18, 2025
అందుకే వైసీపీ నుంచి బయటికి వచ్చాను: విజయసాయి రెడ్డి

AP: వైసీపీలో తాను నంబర్ 2గా ఉన్నానని, జగన్కు వెన్నుపోటు పొడిచానని మీడియాలో రాస్తున్నారని ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 స్థానమనేది ఓ మిథ్య. నాయకుడికి నాపై ఓ కోటరీ చాలా అపోహలు కల్పించింది. ఆయన మనసులో నాకు స్థానం లేదని గ్రహించి అవమాన భారం తాళలేక పార్టీని వీడాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే నా స్థానం 2వేలకు పడిపోయింది’ అని పేర్కొన్నారు.
News April 18, 2025
ఆ నటుడు డ్రగ్స్ డిమాండ్ చేసేవాడు.. నిర్మాత ఆరోపణ

‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు శ్రీనాథ్ భాసీ ప్రస్తుతం ‘నముక్కు కొడత్తియిల్ కాణం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా నిర్మాత హజీబ్ మలబార్ శ్రీనాథ్పై సంచలన ఆరోపణలు చేశారు. షూటింగ్ సమయంలో తనకు ఫోన్ చేసి డ్రగ్స్ తీసుకురావాలని వేధించేవాడని, షూట్ సమయంలో కారవాన్లో డ్రగ్స్ను దాచి వాడేవాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అతడి కారణంగా తమ సినిమా షూటింగ్, డబ్బింగ్ ఆలస్యమయ్యాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
News April 18, 2025
జగన్కు వ్యతిరేకంగా చెబుతానని మీడియా భ్రమపెట్టింది: VSR

AP: మద్యం కేసులో సిట్ విచారణపై తనకేమీ అత్యుత్సాహం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తనకు తెలిసిన విషయాలు చెప్పానని, మరోసారి పిలిస్తే వస్తానని పేర్కొన్నారు. ‘ఈ నెల 18న విచారణకు సిట్ నోటీసు ఇచ్చింది. అయితే నేను అత్యుత్సాహంగా ముందుగానే వచ్చి YS జగన్కు వ్యతిరేకంగా చెప్పబోతున్నాననే భ్రాంతిని కొన్ని మీడియా సంస్థలు కలిగించాయి. ఇలాంటి జర్నలిస్టు ప్రమాణాలు మానుకోవాలి’ అని పేర్కొన్నారు.